Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన: హరీష్‌ రావు

రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన: హరీష్‌ రావు

వార్త 2 weeks ago

Harish Rao: రాష్ట్రంలో మహిళలు మరియు ఆడబిడ్డల రక్షణ పూర్తిగా కరవైందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల ఆస్తులతో పాటు వారి ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సు దారుణ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి

పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడి చదువుకుని, నర్సుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఒక యువతి దారుణ హత్యకు గురికావడం తనను తీవ్రంగా కలచివేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Harish Rao: పెరిగిపోతున్న నేరాలు – ప్రభుత్వ వైఫల్యం

రాష్ట్రంలో పట్టపగలే దారుణ హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతుండటం ప్రభుత్వ యంత్రాంగం డొల్లతనాన్ని ఎత్తిచూపుతోందని హరీష్ రావు విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

'స్నేహితుల వల్లే మత్తు వ్యసనం': ఈగల్ బృందం అధ్యయనంలో దిగ్భ్రాంతికర అంశాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha