Kavitha: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి జాతీయ రాజకీయాల కోసం ప్రజలను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
Read Also:Kavita : కవిత కొత్త పార్టీ తో ఏం చేయబోతున్నారు?

నేషనల్ పార్టీ కోసమే ప్రాజెక్టుల నిర్లక్ష్యం
“పంజాబ్, గుజరాత్, బిహార్‌కు కేసీఆర్ పోయారు. రాష్ట్రంలో మొత్తం పీకి కట్టలు కట్టామని, నేషనల్ పార్టీ పెడతామని అక్కడికి వెళ్లారు. కానీ తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోలేదు” అని కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించి ఇతర రాష్ట్రాల చుట్టూ తిరగడంపై ఆమె మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి నీళ్లు పారకపోయేనా?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని కవిత విమర్శించారు. ఒకవేళ కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టి ఉంటే, ఈపాటికి పాలమూరు-రంగారెడ్డి నీళ్లు పారకపోయేవా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సరిగ్గా పాలించకపోవడం వల్లే కీలక ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ఆమె స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
కవిత కొత్త పార్టీ ప్రకటన.. "ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే".. అంటూ BRS సెటైర్

