Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై ధరల పెంపు.. ఎంతంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై ధరల పెంపు.. ఎంతంటే?

వార్త 2 weeks ago

Royal Enfield Price Hike: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. ఈ బైక్ ధరలను తాజాగా పెంచింది. మొత్తం 9 కలర్ వేరియంట్లపై ఈ ధరల పెంపు వర్తిస్తోంది.

వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది. ధరలు పెరిగినప్పటికీ బైక్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. 2026 అప్‌డేట్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని కొత్త ఫీచర్లను అందించారు.

GST Council: స్విగ్గీ, జొమాటో పై GST తగ్గింపు.. ఎంతకు అంటే?

Classic 350 కొత్త ధరలు ఇవే

తాజా ధరల ప్రకారం Royal Enfield Classic 350 వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

  • Redditch Red: రూ.1.89 లక్షలు
  • Madras Red: రూ.1.96 లక్షలు
  • Medallion Bronze: రూ.2.01 లక్షలు
  • Commando Sand: రూ.2.12 లక్షలు
  • Gurkha Edition: రూ.2.12 లక్షలు
  • Gun Grey: రూ.2.21 లక్షలు
  • Stealth Black: రూ.2.21 లక్షలు
  • Emerald: రూ.2.26 లక్షలు
  • Signature White: రూ.2.26 లక్షలు

Gurkha Editionపై సుమారు రూ.1,000 వరకు ధర పెరగగా.. Emerald, Signature White వేరియంట్లపై రూ.2,000 పెంపు నమోదైంది.

349cc ఇంజిన్.. 20.2 హెచ్‌పీ పవర్

Classic 350లో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 హెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 2026 అప్‌డేట్‌లో డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వేరియంట్లకు అసిస్ట్-స్లిప్పర్ క్లచ్, USB Type-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందించారు. అయితే బేస్ వేరియంట్ Redditch Redలో ఈ రెండు ఫీచర్లు అందుబాటులో లేవు.

Royal Enfield Price Hike: Classic 350కి పోటీగా కొత్త బైక్స్

మరోవైపు 350cc విభాగంలో పోటీ కూడా పెరుగుతోంది. Triumph ఇటీవల Bonneville T4ను రూ.2.55 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 350 సీసీ ఇంజిన్ ఉంటుంది. అలాగే Bonneville T40 ధర రూ.2.80 లక్షలుగా ఉంది. Honda CB350 కూడా Royal Enfield Classic 350కి ప్రధాన పోటీదారుగా కొనసాగుతోంది. ధరల పెంపు నేపథ్యంలో Classic 350 కొనుగోలు చేయాలనుకునే వారు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వేరియంట్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.

Epaper: epaper.vaartha.com

టైటాన్ స్టాక్స్ భారీగా పతనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha