Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ లాంచ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ లాంచ్

వార్త 1 week ago

Royal Enfield Classic 650: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన 125 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని అత్యంత ప్రీమియం లుక్‌తో కూడిన 'క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్' (Classic 650 Hypershift Special Edition) బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

భారత్‌లో ఈ ప్రత్యేక ఎడిషన్ బైక్ ధరను రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.

Tecno Spark 50S 5G: 6500mAh బ్యాటరీతో కొత్త టెక్నో 5G ఫోన్

 Royal Enfield Classic 650 Hypershift Edition Launch

Royal Enfield Classic 650: ప్రపంచవ్యాప్తంగా కేవలం 125 యూనిట్లు మాత్రమే!

ఈ స్పెషల్ ఎడిషన్ అత్యంత ప్రత్యేకమైనది కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో సహా కేవలం 125 యూనిట్లనుమాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే ఆసక్తి గల కొనుగోలుదారులు అక్టోబర్ 28 వరకు అధికారికంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది.

ప్రత్యేకమైన పెయింట్ ఫినిషింగ్ & పవర్‌ఫుల్ ఇంజిన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోడల్‌ను కళ్లు చెదిరే ప్రత్యేకమైన పెయింట్ ఫినిషింగ్‌తో డిజైన్ చేసింది. సాంకేతిక విభాగానికి వస్తే.. ఈ బైక్‌లో శక్తివంతమైన 648 సీసీ ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ (648cc Parallel Twin Engine) అమర్చారు. ఇది 47 హెచ్‌పీ పవర్‌ను, 52.3 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే మోడల్‌గా వచ్చిన ఈ క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్ బైక్ లవర్స్‌ను, ముఖ్యంగా రైడర్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Epaper: epaper.vaartha.com

ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనం టెస్లా ఫ్లయింగ్ కార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha