Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైళ్లలో ఆపరేషన్ నన్హే ఫరిస్తే: 120 మంది చిన్నారుల రక్షణ.. ఆర్పీఎఫ్ ఉక్కుపాదం!

రైళ్లలో ఆపరేషన్ నన్హే ఫరిస్తే: 120 మంది చిన్నారుల రక్షణ.. ఆర్పీఎఫ్ ఉక్కుపాదం!

వార్త 1 week ago

RPF Operation : రైల్వే వ్యవస్థ ద్వారా జరుగుతున్న నేరాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఉక్కుపాదం మోపింది. గత ఏప్రిల్ నెలలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రయాణికుల భద్రత మరియు మత్తు పదార్థాల రవాణాపై ఆర్పీఎఫ్ గణనీయమైన విజయాలను సాధించింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

'నన్హే ఫరిస్తే'తో 120 మంది చిన్నారులకు విముక్తి

మానవ అక్రమ రవాణాదారుల చెర నుంచి చిన్నారులను రక్షించేందుకు చేపట్టిన 'నన్హే ఫరిస్తే' ఆపరేషన్ అద్భుత ఫలితాలనిచ్చింది. ఇందులో భాగంగా 96 మంది బాలురు, 24 మంది బాలికలు కలిపి మొత్తం 120 మంది చిన్నారులను ఆర్పీఎఫ్ రక్షించింది. రక్షించిన వారందరినీ సురక్షితంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అలాగే 'ఆపరేషన్ ఆహాత్' ద్వారా మరో ఐదుగురు బాలురను రక్షించి, ఇద్దరు అక్రమ రవాణాదారులను కటకటాల్లోకి నెట్టారు.

Read Also: Peddi Movie: పెద్ది ప్రమోషన్లకు జాన్వీ దూరం.. కారణం అదేనా?

 RPF Operation

ప్రయాణికుల సొత్తు రికవరీ.. గంజాయి స్వాధీనం

కేవలం అక్రమ రవాణానే కాకుండా, నేరస్థుల ఆట కట్టించడంలోనూ ఆర్పీఎఫ్ ముందుంది. 'యాత్రి సురక్ష' ఆపరేషన్‌లో 79 మంది నేరస్థులను అరెస్ట్ చేసి, రూ. 54.52 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. ప్రయాణికులు పొరపాటున వదిలేసిన రూ. 83.35 లక్షల విలువైన వస్తువులను 'ఆపరేషన్ అమానత్' ద్వారా తిరిగి యజమానులకు అందజేశారు. ఇక 'నార్కోస్' ఆపరేషన్‌లో భాగంగా రూ. 86.17 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha