Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైలు ఎక్కాలంటే నిచ్చెన కావాల్సిందేనా?

రైలు ఎక్కాలంటే నిచ్చెన కావాల్సిందేనా?

వార్త 2 weeks ago

Hyderabad local trains:హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం రోజురోజుకూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. మెట్రో తరహాలో మెట్లు లేకుండా నేరుగా ఉండే ఈ బోగీలు, స్టేషన్లలోని లో లెవెల్ ప్లాట్‌ఫామ్‌ల కారణంగా భూమికి 3 అడుగుల ఎత్తులో కనిపిస్తున్నాయి.

దీనివల్ల ప్లాట్‌ఫామ్‌కు, రైలు ఫుట్ బోర్డుకు మధ్య భారీ గ్యాప్ ఏర్పడి ప్రయాణికులు రైలు ఎక్కేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. ఖైరతాబాద్ నుంచి లింగంపల్లి వరకు ప్రయాణికులు పడుతున్న ఈ కష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక విషయాలు వెలుగు చూశాయి. రైలు లోపలి ఫ్లోర్ ఎత్తు పట్టాల నుంచి సుమారు 1200 మి.మీ నుంచి 1300 మి.మీ ఎత్తులో ఉండగా, భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం హైలెవల్ ప్లాట్‌ఫామ్ గరిష్ఠ ఎత్తు 760 మి.మీ నుంచి 840 మి.మీ మాత్రమే ఉండాలి. దీంతో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Read also: Telangana Express: 50 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్​

 You need a ladder to board the train!

సాంకేతిక సమస్యలు – రైల్వే ఎదుర్కొంటున్న సవాళ్లు

ఎంఎంటీఎస్ నడిచే అదే పట్టాలపై గూడ్స్ రైళ్లు, వెడల్పైన ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ప్రయాణిస్తుండటంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఒకవేళ ప్లాట్‌ఫామ్ ఎత్తును ఎంఎంటీఎస్ కోచ్‌లకు సమానంగా పెంచితే, ఇతర రైళ్ల అంచులు ప్లాట్‌ఫామ్ తాకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైల్వే చెబుతోంది. ఒకే రూట్ లో నడిచే లైన్లలో ప్లాట్‌ఫామ్ ఎత్తుల నిర్వహణ విభిన్నంగా ఉండటం గమనార్హం. ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్, చందానగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఎత్తు తక్కువగా ఉండటంతో 2 నుంచి 3 అడుగుల మేర పైకి ఎగిరి ఎక్కడం లేదా కిందకు దూకడమో చేయాల్సి వస్తోంది. బోరబండ, ఫతేనగర్, భరత్ నగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ కింది ఖాళీ స్థలంలో కాళ్లు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్టేషన్లో రైలు ఆగినప్పుడు మాత్రమే తెరుచుకునే ఆటోమేటిక్ అదనపు మెట్లను బోగీలకు అమర్చడం ఉత్తమం.

Hyderabad local trains:పూర్వవైభవం కోసం తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు

ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేసి, రైళ్ల సంఖ్యను మరియు ఫ్రీక్వెన్సీని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో సగటున రోజుకు 121 ఎంఎంటీఎస్ రైళ్లు తిరిగితే ప్రస్తుతం ఆ సంఖ్య 80 నుంచి 88కి మాత్రమే పరిమితమైంది. మరోవైపు సమయపాలన లోపించడం వల్ల ఈ రైళ్లపై ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. రైలు దిగిన తర్వాత స్టేషన్ల నుంచి సిటీ బస్సులు సరిగ్గా అందుబాటులో లేకపోవడం కూడా ప్రయాణికులను దూరం చేస్తోంది. ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టడం, మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ పహారా ఏర్పాటు చేయడం, రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ వ్యవస్థను తేవడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. మెట్రో మరియు ఆర్టీసీతో మెరుగైన అనుసంధానం కల్పిస్తే నగర ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Epaper: epaper.vaartha.com

50 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha