Railway rules 2026:ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణికుల కొత్త నిబంధనలు ఈ నెల నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
జన్ విశ్వాస్ చట్టం 2026 ప్రకారం ఇకపై రైలు బోగీల్లో లేదా స్టేషన్ పరిధిలో పొగతాగడం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 100 ఉన్న జరిమానాను రూ. 2000కు పెంచారు. అంతేకాకుండా టికెట్ రద్దు చేసి ప్రయాణికులను తదుపరి స్టేషన్‌లో దించేస్తారు
India Warns : అత్యవసరం అయితే తప్ప ఇరాన్‌కు ప్రయాణం చేయవద్దు: భారత్ హెచ్చరిక.
New rules for train passengers
అనధికార వ్యాపారాలు భిక్షాటనపై కఠిన చర్యలు
రైల్వే ప్రాంగణాల్లో లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం, భిక్షాటన చేయడం వంటివి నేరంగా పరిగణించబడతాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇటువంటి పనులకు పాల్పడే వారిపై రూ. 2000 జరిమానా విధిస్తారు. వీటితో పాటు 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా, శిక్ష రెండు కలిపి పడే అవకాశం ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఏ చర్యను రైల్వే శాఖ ఉపేక్షించదు.
Railway rules 2026:పదే పదే తప్పులు చేస్తే కఠిన కారాగార శిక్ష
నియమాలను ఉల్లంఘిస్తూ పదే పదే తప్పులు చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారు మళ్ళీ దొరికితే ఏడాది పాటు జైలు శిక్ష పడుతుంది. ప్రయాణికులు సురక్షితంగా, ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ కొత్త చట్టం పట్ల అప్రమత్తంగా ఉండి నిబంధనలు పాటించడం మంచిది.
Epaper: epaper.vaartha.com

