Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే ప్రయాణికుల కోసం 5 గంటలకే మెట్రో ప్రారంభం!

రైల్వే ప్రయాణికుల కోసం 5 గంటలకే మెట్రో ప్రారంభం!

వార్త 2 months ago

Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే ఒక శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. మెట్రో రైలు సేవలను ప్రస్తుతం ఉన్న ఉదయం 6 గంటలకు బదులుగా, గంట ముందుగానే అంటే తెల్లవారుజామున 5 గంటలకే ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రతిపాదించింది.

దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.

Read Also:Egg Rates Today: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

 Government Takes Key Decision on Metro Timings

Hyderabad Metro Timings: ప్రయాణికుల ఇబ్బందులే ప్రధాన కారణం

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య చేరుకుంటుంటారు. అలాగే వందే భారత్ వంటి కీలక రైళ్లు కూడా ఉదయాన్నే బయలుదేరుతుంటాయి. ఆ సమయంలో మెట్రో అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రోను 5 గంటలకే ప్రారంభిస్తే వీరందరికీ ఎంతో వెసులుబాటు కలుగుతుందని రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు విన్నవించారు.

ఎల్ అండ్ టీ అభ్యంతరం.. ప్రభుత్వ పట్టు

గతంలో ఇదే అంశంపై చర్చ జరిగినప్పుడు, నిర్వహణ (Maintenance) కారణాలతో ఉదయం 5 గంటలకు రైళ్లను నడపడం సాధ్యం కాదని ఎల్ అండ్ టీ – హెచ్ఎంఆర్ ఎల్ అధికారులు తెలిపారు. పట్టాల నిర్వహణ మరియు భద్రతా తనిఖీలకు రాత్రి సమయం సరిపోదని వారు పేర్కొన్నారు. అయితే, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉదయం 5 గంటలకే మెట్రో నడుస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఎందుకు సాధ్యం కాదనే చర్చ మొదలైంది. పైగా, మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం త్వరలో తన చేతుల్లోకి తీసుకోనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇతర మెట్రోల టైమింగ్స్ ఇలా..

దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో కాస్త ఆలస్యంగానే ప్రారంభమవుతోంది:

  • బెంగళూరు, చెన్నై: ఉదయం 5:00 గంటలకు.
  • ఢిల్లీ, ముంబై: ఉదయం 5:30 గంటలకు.
  • హైదరాబాద్: ప్రస్తుతం ఉదయం 6:00 గంటలకు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మెట్రో అధికారులు ఈ ప్రతిపాదనపై మరోసారి సమీక్ష జరుపుతున్నారు. అంతా సవ్యంగా సాగితే, త్వరలోనే భాగ్యనగర వాసులకు తెల్లవారుజామున 5 గంటలకే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణపై వరుణుడి పంజా: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha