Railways Employees Bonus:కేంద్ర ప్రభుత్వం అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం వల్ల దసరా పండుగ వేళ లక్షలాది మంది సిబ్బందికి ఆర్థిక ఊరట లభించనుంది. రైల్వే ఉద్యోగుల బోనస్ 2026 ప్రకటన కోసం ఉద్యోగులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Traffic Fines Update: చలాన్ల లెక్క చూస్తే మైండ్ బ్లాక్
Railways Employees Bonus
11.72 లక్షల మందికి లబ్ధి
ఈ బోనస్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశవ్యాప్తంగా దాదాపు 11.72 లక్షల మంది రైల్వే సిబ్బందికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగ వర్గాలకు ఈ పండుగ కానుక ఎంతో ప్రోత్సాహకరంగా మారనుంది.
Railways Employees Bonus:ఖాతాల్లో రూ. 17,951 వరకు జమ
ఈ ప్రత్యేక బోనస్ కింద అర్హత కలిగిన ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ. 17,951 వరకు లభించే అవకాశం ఉంది. దసరా, దుర్గాపూజ ఉత్సవాల సమయానికి ఈ సొమ్ము నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

