Dailyhunt
రైల్వే ఉద్యోగులకు 'ఎంప్లాయీ ఆఫ్ ది మంత్' భద్రతా అవార్డులు

రైల్వే ఉద్యోగులకు 'ఎంప్లాయీ ఆఫ్ ది మంత్' భద్రతా అవార్డులు

వార్త 2 weeks ago

South Central Railway Awards: దక్షిణ మధ్య రైల్వే (ఎస్.సి.ఆర్), సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో నిర్వహించిన ఒక సమగ్ర సమీక్షా సమావేశం ద్వారా, రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత పట్ల తన అంకిత భావాన్ని దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.

సిబ్బంది అసురక్షిత పరిస్థితులను నివారిస్తూ తమ విధి నిర్వహణలో చురుకుదనం, అంకితభావాన్ని ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పది మంది ఉద్యోగులకు ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు.

Read Also : Chandrababu Naidu: రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు

 Railways’ ‘Employee of the Month’ awards

South Central Railway Awards: అవార్డు గ్రహీతల వివరాలు

ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్తో పాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జోన్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన ట్రాక్ నిర్వహకులు, పాయింట్స్ మెన్, సాంకేతిక నిపుణులు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, లోకో పైలట్లతో సహా క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

భద్రతా ప్రమాణాలపై జిఎం దిశానిర్దేశం

జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడంలో చూపిన అంకితభావాన్ని ప్రశంసించారు. ఇటువంటి గుర్తింపు ఇతర చిత్యసినిను కూడా అప్రమత్తంగా ఉండటానికి, రైలు కార్యకలాపాలలో భద్రతా ప్రమాణాలను పాటించడానికి ప్రేరేపిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో శ్రీవాస్తవ అధికారులను పనిస్థలాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి షార్ట్కట్లను అనుసరించవద్దని/పాటించవద్దని/ ఆశ్రయించవద్దని ఆదేశించారు. అధికారులు, పర్యవేక్షకులు సిబ్బంది అప్రమత్తతపై, అలాగే నిర్దేశించిన విధానాలను అనుసరించడంపై దృష్టి పెట్టి, క్రమం తప్పకుండా భద్రతా డ్రైవ్లు నిర్వహించాలని ఆయన సూచించారు. భద్రతా అవసరాల విషయంలో ఎన్నడూ రాజీ పడకూడదని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నొక్కి చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha