Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైస్ మిల్లింగ్ రంగాన్ని కాపాడుకుందాం: రైస్ మిల్లర్స్ అసోసియేషన్

రైస్ మిల్లింగ్ రంగాన్ని కాపాడుకుందాం: రైస్ మిల్లర్స్ అసోసియేషన్

వార్త 3 weeks ago

Medak Rice Millers:మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రైస్ మిల్లింగ్ రంగాన్ని రక్షించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

మిల్లర్లపై జరుగుతున్న ఒత్తిడి, దాడులను నిలిపివేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, విద్యుత్‌ చార్జీలు, కార్మికుల వ్యయాలు, రవాణా ఖర్చుల కారణంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ చార్జీలను తక్షణమే పెంచి, మిల్లర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read Also:Vijay dairy parlarlu: మహిళలకు విజయ డెయిరీ పార్లర్లు

అదేవిధంగా ఓటీఆర్ (OTR)ను వెంటనే పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో Sortex వినియోగం వల్ల ఏర్పడే 15 నుంచి 20 శాతం వరకు స్టోరేజీని అనుమతించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సడలించి, మిల్లర్లకు ఆర్థిక భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైస్ మిల్లింగ్ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, రవాణా రంగం, అనుబంధ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, మిల్లుల మనుగడకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మిల్లర్లు తెలిపారు.

రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆకలి తీర్చడంలోనూ, సివిల్ సప్లైస్ వ్యవస్థను సమర్థవంతంగా నడిపించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న రైస్ మిల్లింగ్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. గురువారం మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్, రా రైస్ మిల్ జిల్లా అధ్యక్షుడు వీరేశం మాట్లాడుతూ కొందరు మిల్లర్లు చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని, రైస్ మిల్ వ్యవస్థ మొత్తాన్ని అనుమానాస్పదంగా చూడటం మరియు మిల్లర్లందరినీ తప్పుగా చిత్రీకరించడం సముచితం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నిజాయితీగా సేవలు అందిస్తున్న వేలాది మంది మిల్లర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.


Medak Rice Millers: ప్రభుత్వానికి మరియు సివిల్ సప్లైస్ మంత్రికి ప్రధాన విజ్ఞప్తులు

​అక్రమార్కులపై మాత్రమే చర్యలు: ధాన్యం దుర్వినియోగం చేసిన వ్యక్తిగత మిల్లర్లపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసుల కంటే రికవరీకి ప్రాధాన్యత ఇవ్వాలని: పరిశ్రమను దెబ్బతీసే క్రిమినల్ కేసులు, వేధింపుల కంటే బకాయిలు లేదా ధాన్యం రికవరీకే ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల ప్రభుత్వానికి లబ్ధి చేకూరడంతో పాటు పరిశ్రమ మూతపడకుండా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి కమిటీ: తరుగు, డ్రైయేజ్, మిల్లింగ్ ఛార్జీల ఆలస్యం వంటి సాంకేతిక, ఆర్థిక సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం సివిల్ సప్లైస్ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.
​రైస్ మిల్లింగ్ రంగంపై లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శివకుమార్, రమేష్, జగదీష్, రాములు, నర్సింలు, వేణు, వీరేశం, అశోక్, శ్రీధర్ తదితరులు

Epaper: epaper.vaartha.com

తప్పుల తడకగా మారిన కొత్త రేషన్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha