Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు ఊరట.. సబ్సిడీ పెంచిన కేంద్రం

రైతులకు ఊరట.. సబ్సిడీ పెంచిన కేంద్రం

వార్త 2 months ago

India fertilizer : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి భారీగా తగ్గింది.

మార్చి నెలలో ఉత్పత్తి దాదాపు 24.6 శాతం వరకు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

హర్మూజ్ జలసంధి ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ప్రభావితమయ్యాయి. దీని వల్ల సహజ వాయువు సరఫరా తగ్గింది. యూరియా వంటి ఎరువుల తయారీలో సహజ వాయువు కీలక పాత్ర పోషించడంతో ఉత్పత్తి ప్రక్రియ దెబ్బతింది.

Read Also : KCR: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

 India fertilizer

రైతులకు కేంద్రం భరోసా

ఈ పరిస్థితుల్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా ఉండేందుకు ఎరువుల సబ్సిడీని 11 శాతం పెంచింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెట్రోల్ ధర లీటర్ కు రూ. 15 పెరగనుందా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha