Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Raja Saab: ఓటీటీలో దూసుకుపోతున్న 'ప్రభాస్' సినిమా

Raja Saab: ఓటీటీలో దూసుకుపోతున్న 'ప్రభాస్' సినిమా

వార్త 4 months ago

థియేటర్లలో విడుదలైన సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమా 'రాజా సాబ్' (Raja Saab) ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రానికి ఊహించని స్పందన లభిస్తోంది. తాజాగా జియో హాట్ స్టార్‌లో విడుదలైన ఈ సినిమా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' టీజర్ లాంచ్

సెన్సేషనల్ వ్యూస్

విడుదలైన మొదటి వారంలోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ వల్లే ఈ వ్యూస్ వచ్చాయని, 'సలార్' సినిమాకు కూడా ఇదే హాట్ స్టార్‌లో సెన్సేషనల్ వ్యూస్ వచ్చాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'స్పిరిట్', 'ఫౌజీ', 'కల్కి 2' చిత్రాలపై దృష్టి సారించారు. 'ఫౌజీ' చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha