Dailyhunt
Rajamouli-Mahesh Babu: వారణాసిలో కిచ్చా సుదీప్?

Rajamouli-Mahesh Babu: వారణాసిలో కిచ్చా సుదీప్?

వార్త 1 month ago

Rajamouli-Mahesh Babu: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన మహేశ్ బాబు కలిసి పని చేయడం సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైథలాజికల్ టచ్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది.

Cult movie teaser : 'కల్ట్' టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

కీలక పాత్ర

ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా, 'ఈగ' ఫేమ్ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, 'ఈగ' తర్వాత కిచ్చా సుదీప్‌కు రాజమౌళితో పనిచేసే అవకాశం లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Anirudh ravichander : హైదరాబాద్‌లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha