Dailyhunt
Rajasaab: సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

Rajasaab: సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

వార్త 3 months ago

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా సినిమా 'ది రాజా సాబ్'(Rajasaab) విడుదలకు ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్, ఫాంటసీ కలయికలో రూపొందుతోంది.

ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' టీజర్ రిలీజ్

'ది రాజాసాబ్' చిత్రం (Rajasaab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మైక్ పట్టుకుని తన అభిమానులను 'డార్లింగ్స్, ఎలా ఉన్నారు?' అంటూ పలకరించారు. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని చిత్రాలు భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీవిజయవంతం అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్టయిపోతే హ్యాపీ' అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Komatireddy: 'దండోరా' సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha