Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రక్షణ మంత్రి పర్యటన: పుట్టపర్తిలో భారీ ఏరోస్పేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

రక్షణ మంత్రి పర్యటన: పుట్టపర్తిలో భారీ ఏరోస్పేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

వార్త 3 months ago

Rajnath Singh AP Visit: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దేశ రక్షణ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని కేంద్ర మంత్రితో కలిసి ప్రాజెక్టుల వివరాలను సమీక్షిస్తారు.

Read Also:B Rama Rao IAS: ఏపీ మాజీ సీఎస్ బి. రామారావు కన్నుమూత

Rajnath Singh AP Visit: ఏపీలో కొత్త శకం!

ఈ పర్యటనలో భాగంగా విమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్ మరియు సర్టిఫికేషన్ వంటి కీలక ప్రక్రియల కోసం ఏర్పాటు చేయనున్న ‘ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్’కు పునాది రాయి వేయడం అత్యంత ప్రధానమైన అంశం. దీనితో పాటు, అనకాపల్లి జిల్లా టి.సిరసపల్లిలో నిర్మించనున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) యూనిట్‌కు కూడా రక్షణ మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెరగడమే కాకుండా, నిపుణులైన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దేశ ఆర్థిక భద్రతకు ప్రతి కుటుంబం బాధ్యతగా పొదుపు చర్యలు తీసుకోవాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha