Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram charan twins : రామ్‌చరణ్ కవలల పేర్లు రివీల్, శివరామ్, అన్విరా దేవి!

Ram charan twins : రామ్‌చరణ్ కవలల పేర్లు రివీల్, శివరామ్, అన్విరా దేవి!

వార్త 4 months ago

Ram charan twins : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరియు ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా వెల్లడించారు. ఇటీవల జన్మించిన బాబుకు శివరామ్ , పాపకు అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు తెలిపారు.

జనవరి 31న ఈ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ఈ పేర్ల వెనుక ఉన్న భావాన్ని వివరించారు.

Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

'శివరామ్' అనే పేరులో శివుడు, శ్రీరాముడు పేర్లతో పాటు తన తండ్రి చిరంజీవి అసలు పేరు 'శివ శంకర వరప్రసాద్' ప్రతిధ్వనించేలా భావం దాగి ఉందని చెప్పారు. 'అన్విరా దేవి' అనే పేరుకు అపార ధైర్యం, దైవిక స్త్రీ శక్తి అనే అర్థం వచ్చేలా ఎంపిక చేశామని తెలిపారు. కుటుంబ పెద్దల ఆశీస్సులతోనే ఈ పేర్లు నిర్ణయించామని చెప్పారు.

2023లో జన్మించిన క్లింకారా తర్వాత, శివరామ్ మరియు అన్విరా దేవి చరణ్-ఉపాసన దంపతులకు రెండో, మూడో సంతానంగా చేరారు.

Read hindi news: hindi.vaartha.com

Nikhil: 'స్వయంభు' టీజర్ రిలీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha