Ranabali Movie: టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ 'రణబాలి' నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ చేరినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read also: Nani Paradise Movie: నాని 'ప్యారడైజ్' మూవీ విడుదల వాయిదా?
'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో
'ది మమ్మీ' సిరీస్‌లో ఇమ్‌హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ, ఈ సినిమాతో భారతీయ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను మూవీ టీమ్ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Ranabali Movie: శక్తివంతమైన నెగెటివ్ షేడ్ పాత్ర
ఈ చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లూ 'సర్ థియోడర్ హెక్టర్' అనే పాత్రలో కనిపించనున్నారు. తీవ్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను మరింత భయానకంగా చూపించేందుకు ఆయనకు 'ది డెమోన్ ఆఫ్ డ్రాట్' అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఇచ్చారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిరవ్ షా నిర్వహిస్తున్నారు.
విడుదల ప్లానింగ్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న 'రణబాలి' చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. హాలీవుడ్ నటుడి చేరికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

