Dailyhunt
Ranveer Singh: 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి 'ధురంధర్'

Ranveer Singh: 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి 'ధురంధర్'

వార్త 3 months ago

బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి అరుదైన రికార్డు సాధించింది. క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25) ఈ మైలురాయిని అందుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా వెల్లడించాయి. ఈ ఘనతతో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన 9వ భారతీయ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది.

Read also: Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న 'ధురంధర్'

డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. వాణిజ్య వర్గాల లెక్కల ప్రకారం, 21వ రోజు నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1006.7 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. భారత్‌లో రూ.668.80 కోట్ల నెట్ కలెక్షన్లు (రూ.789.18 కోట్ల గ్రాస్) సాధించగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.217.50 కోట్లు సమకూరాయి. ఈ విజయంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'కాంతార: చాప్టర్ 1' రికార్డును 'ధురంధర్' అధిగమించింది.

స్పెషల్ పోస్టర్ విడుదల

ఈ సందర్భంగా జియో స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ, 'రూ.1000 కోట్ల క్లబ్‌లో గర్వంగా అడుగుపెట్టాం… 'ధురంధర్' ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది' అని పేర్కొంది. ఈ ఘన విజయంపై చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దర్శకుడు ఆదిత్య ధర్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.

అద్భుతమైన రెస్పాన్స్ నేపథ్యంలో, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 'ధురంధర్ పార్ట్ 2: ది రివెంజ్' పేరుతో రానున్న ఈ సినిమాను 2026 మార్చి 19న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ విజయం ద్వారా రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను అందుకుని, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Vicky Kaushal: 'సినిమా విజయం కోసం దేశభక్తి మాత్రమే కాదు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha