Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యా యువతకు పుతిన్ బంపర్ ఆఫర్.. కోటి అప్పులు రద్దు

రష్యా యువతకు పుతిన్ బంపర్ ఆఫర్.. కోటి అప్పులు రద్దు

వార్త 3 months ago

Russia Loan Waiver : ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా సైన్యంలో కొత్తగా చేరే వారికి భారీ రుణ మాఫీ కల్పించే చట్టబద్ధ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.

సైన్యంలో చేరే యువతను ప్రోత్సహించేందుకు ఈ కొత్త ఆర్థిక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది.

కోటి రూపాయల వరకు రుణ మాఫీ

ఈ పథకం ప్రకారం సైన్యంలో చేరే కొత్త రిక్రూట్లకు గరిష్టంగా 10 మిలియన్ రూబుల్స్ వరకు ఉన్న పాత అప్పులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.33 కోట్లకు సమానం. కేవలం సైనికుడి అప్పులే కాకుండా, అతని భార్య పేరిట ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తారు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు రక్షణ శాఖతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలి.

Read Also: Kompally chain snatching: బంగారం కోసం మహిళపై దాడి.. నిందితుడిని చితకబాదిన స్థానికులు

 Russia Loan Waiver

యుద్ధానికి మానవ వనరులే లక్ష్యం

ఈ రుణ మాఫీ అందరికీ వర్తించదని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 1కు ముందు తీసుకున్న రుణాలు, (Russia Loan Waiver) ఇప్పటికే రికవరీ ప్రక్రియలో ఉన్న బకాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. యుద్ధంలో సైనికుడు మరణించినా లేదా శాశ్వత వికలాంగుడిగా మారినా కుటుంబ రుణాలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి వెళ్లడంతో సైన్యంలో మానవ వనరుల కొరత రాకుండా ఉండేందుకు పుతిన్ ప్రభుత్వం ఈ తరహా ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బెల్జియంలో పాఠశాల బస్సును ఢీకొట్టిన రైలు..పలువురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha