Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం

రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం

వార్త 1 week ago

Russia Earthquake: రష్యాలోని సుదూర ప్రాంతమైన కమ్చట్కాలో శుక్రవారం భూమి ఒక్కసారిగా కంపించింది. ఓజెర్నోవ్‌స్కీ ప్రాంతానికి సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో ఈ భారీ భూకంపం నమోదైంది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:36 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా ఒక నిమిషం పాటు భూమి నిరంతరం కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీసిన జనం

భూకంప తీవ్రత కారణంగా ఇళ్లలోని వస్తువులు దానంతట అవే కదలడం, గోడలు వణకడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి చేరుకున్నారు. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రకృతి ప్రకోపంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

Russia Earthquake: సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన శాస్త్రవేత్తలు

ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జియోఫిజికల్ సర్వీస్ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ భూకంపం భూ అంతర్భాగంలో చాలా ఎక్కువ లోతులో సంభవించిందని తెలిపారు. దీనివల్ల సముద్రంలో ఎలాంటి అలల అసాధారణ కదలికలు ఉండవని, కాబట్టి సునామీ ముప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనం టెస్లా ఫ్లయింగ్ కార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha