Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్

రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్

వార్త 1 month ago

Russian T10 League: రష్యాలో క్రికెట్ సందడి మొదలైంది. దేశంలో క్రికెట్‌ను పునరుజ్జీవింపజేయాలనే విశాల లక్ష్యంతో రష్యన్ క్రికెట్ ఫెడరేషన్ (క్రికెట్ రష్యా) సరికొత్త టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టింది.

‘రష్యన్ టీ10 లీగ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనుంది. చారిత్రాత్మక లుజ్నికి స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తోంది. ఈ రెండు రోజుల ఈవెంట్‌లో మాస్కో ఫాక్సెస్, క్రెమ్లిన్ స్టార్స్, కజాన్ ఫాల్కన్స్, సెయింట్ పీటర్స్‌బర్గ్ లయన్స్ అనే నాలుగు జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనుండగా, పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ సమరం జరగనుంది.

Read Also : Asian Games 2026: త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!

 T10 Cricket League kicks off in grand style in Russia.

Russian T10 League: నగరాల ఫ్రాంచైజీలతో దీర్ఘకాలిక ప్రణాళిక

ఈ లీగ్ ప్రారంభంపై రష్యన్ క్రికెట్ ఫెడరేషన్ డైరెక్టర్ సంభవ్ జైన్ మాట్లాడుతూ, “ఈ టోర్నమెంట్ కేవలం ఒక క్రీడా పోటీ మాత్రమే కాదు. రష్యా వ్యాప్తంగా క్రికెట్‌ను ప్రోత్సహించడం, కొత్త ఆటగాళ్లను, ప్రేక్షకులను ఆకర్షించడం, క్రీడాభివృద్ధికి మరిన్ని అవకాశాలు సృష్టించడం అనే విస్తృత దృష్టిలో ఇది ఒక భాగం” అని వివరించారు. ఈ టోర్నీలో నాలుగు జట్ల తరఫున మొత్తం 60 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ టీ10 లీగ్ ద్వారా రష్యాలో తొలిసారిగా ఒక నిర్మాణాత్మక దేశీయ క్రికెట్ క్యాలెండర్ రూపుదిద్దుకుంది. స్థానిక రష్యన్ ఆటగాళ్లతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు, దక్షిణాసియా వాసులు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు.

2028 ఒలింపిక్స్ లక్ష్యంగా అడుగులు

రష్యాలో క్రికెట్‌ను ప్రధాన స్రవంతి క్రీడగా మార్చాలనే ‘రష్యా క్రికెట్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్’లో ఈ టీ10 లీగ్ మొదటి ఘట్టం. భవిష్యత్తులో దేశంలో బలమైన దేశీయ లీగ్‌ను ఏర్పాటు చేయడం, ప్రతి ప్రధాన నగరంలో ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు అంతర్జాతీయ వేదికపై పోటీపడేలా రష్యా జాతీయ జట్టును సిద్ధం చేయడం వీరి దీర్ఘకాలిక లక్ష్యాలు. “2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశిస్తున్న తరుణంలో, ఈ లీగ్ ప్రారంభించడం సరైన ముందడుగు. ఇతర అసోసియేట్ దేశాల తరహాలోనే నగరాధారిత ఫ్రాంచైజీ పోటీ రష్యా క్రికెట్ అభివృద్ధికి స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది” అని సంభవ్ జైన్ పేర్కొన్నారు.

రష్యన్ టీ10 లీగ్ షెడ్యూల్:

2026 సెప్టెంబర్ 19:

  • మ్యాచ్ 1: క్రెమ్లిన్ స్టార్స్ vs కజాన్ ఫాల్కన్స్
  • మ్యాచ్ 2: మాస్కో ఫాక్సెస్ vs సెయింట్ పీటర్స్‌బర్గ్ లయన్స్
  • మ్యాచ్ 3: క్రెమ్లిన్ స్టార్స్ vs మాస్కో ఫాక్సెస్

2026 సెప్టెంబర్ 20:

  • మ్యాచ్ 1: కజాన్ ఫాల్కన్స్ vs సెయింట్ పీటర్స్‌బర్గ్ లయన్స్
  • మ్యాచ్ 2: క్రెమ్లిన్ స్టార్స్ vs సెయింట్ పీటర్స్‌బర్గ్ లయన్స్
  • మ్యాచ్ 3: కజాన్ ఫాల్కన్స్ vs మాస్కో ఫాక్సెస్
  • ఫైనల్: మొదటి స్థానం vs రెండో స్థానం

ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha