Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన మరియు అదృశ్యమైన భారతీయుల కుటుంబాలకు తక్షణమే న్యాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాధిత కుటుంబాల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది:బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి, వారి సందేహాలను నివృత్తి చేయడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలి. మృతులు, గాయపడినవారు మరియు అదృశ్యమైన వారి వివరాలను అధికారిక ప్రకటన ద్వారా స్థానిక భాషల్లోనే బాధిత కుటుంబాలకు తెలియజేయాలి.
Read Also: NEET Paper Leak Protest: నీట్ పేపర్ లీక్‌పై పోరాడిన యువతిపై క్రిమినల్ కేసులా: CJP
Supreme Court
Supreme Court : డీఎన్‌ఏ పరీక్షలు మరియు మృతదేహాల అప్పగింత
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించింది: ఇండియాలోని బాధిత కుటుంబాల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, రష్యాలో లభించిన మృతదేహాల డీఎన్‌ఏతో సరిపోల్చాలి. గుర్తింపు పూర్తయిన తర్వాత భౌతికకాయాలను లేదా అస్థికలను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అందజేసి, అంత్యక్రియలు సజావుగా జరిగేలా చూడాలి. పరిహారం ప్రక్రియ ఆలస్యమైనంత మాత్రాన మృతదేహాల అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేసింది. పరిహారం, రాయబార కార్యాలయాల ద్వారా దావా & న్యాయ సహాయం ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయం నుండి బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, వారికి రావలసిన నష్టపరిహారాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ద్వారానే నేరుగా అందజేయాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా రష్యా రాయబార కార్యాలయాలను ఆదేశించేందుకు తగిన దావా వేయాలని కేంద్రాన్ని కోరింది. బాధితులకు అవసరమైన చట్టపరమైన సాయాన్ని అందించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించింది.
నేపథ్యం: 2024, 2025లలో రష్యాకు వివిధ వర్క్ వీసాలపై వెళ్లిన అనేక మంది భారతీయులను దగా చేసి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ముందువరుస పోరాటాలకు ఉపయోగించుకున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సరైన సమాచారం అందక తల్లడిల్లుతున్న కుటుంబాలు చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా?

