Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రవి బిష్ణోయ్ గూగ్లీకి కోహ్లీ బలి..

రవి బిష్ణోయ్ గూగ్లీకి కోహ్లీ బలి..

వార్త 2 months ago

Kohli Clean Bowled Ravi Bishnoi: ఐపీఎల్ 2026లో భాగంగా గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సంచలన దృశ్యం నమోదైంది.

గత మూడేళ్లుగా ఏ బౌలర్‌కూ చిక్కని విధంగా, విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మ్యాజికల్ గూగ్లీతో రన్ మెషీన్‌ను బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు.

Read Also: RR vs RCB IPL Live: సూర్యవంశీ విధ్వంసం.. 8 ఓవర్లకే RR 129/1

1,089 రోజుల తర్వాత తొలిసారి..

ఈ వికెట్‌తో ఒక అరుదైన గణాంకం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ బౌల్డ్ కావడం 1,089 రోజుల తర్వాత ఇదే తొలిసారి.2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో కోహ్లీ చివరిసారిగా బౌల్డ్ అయ్యాడు.అప్పటి నుంచి దాదాపు 3 ఏళ్లుగా కోహ్లీ ఎన్నో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఏ బౌలర్ కూడా అతడిని క్లీన్ బౌల్డ్ చేయలేకపోయారు. తాజాగా రవి బిష్ణోయ్ ఆ ఘనతను సాధించి కోహ్లీ డిఫెన్స్‌ను ఛేదించాడు.

Kohli Clean Bowled Ravi Bishnoi: బిష్ణోయ్ గూగ్లీకి విరాట్ నిశ్చేష్టుడు

ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 32 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న కోహ్లీని రవి బిష్ణోయ్ తన గూగ్లీతో బోల్తా కొట్టించాడు. బిష్ణోయ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దీంతో బంతి అతని బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. ఈ ఊహించని బంతికి కోహ్లీ నిశ్చేష్టుడైపోయాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం..జురెల్ (81), వైభవ్ (78) ఊచకోత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha