Razor Movie Review: విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు తనదైన శైలిలో కొంత విరామం తర్వాత ఆయన హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం 'రేజర్'.
యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ప్రచారం పొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ 'రేజర్' ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
రాష్ట్ర హోమ్ మంత్రి కనకరాజు, ముఖ్యమంత్రి సీతారామయ్యను హత్య చేసి ఆ పదవిని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి బిజినెస్ చేసే విష్ణు (తనీష్) చేతికి చిక్కుతాయి. విషయం తెలుసుకున్న మంత్రి అనుచరులు విష్ణును, అతని భార్యను చంపేస్తారు. ఈ దారుణాన్ని విష్ణు చిన్న కూతురు తేజు కళ్లారా చూస్తుంది. అదే సమయంలో ఆ ఇంటికి కుక్కలను గ్రూమింగ్ చేయడానికి వచ్చిన రుద్ర (రవిబాబు), ఆ పాపను రక్షించి అక్కడి నుండి తప్పిస్తాడు. విష్ణు చనిపోయే ముందు సీఎం హత్యకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఎక్కడ ఉన్నాయో కూతురికి క్లూ ఇస్తాడు. ఆ వీడియో కోసం హోమ్ మంత్రి బృందం రుద్ర, తేజులను ఎలా వెంటాడింది? చివరికి ఆ క్లిప్పింగ్స్ ఏమయ్యాయి? రుద్ర ఆ పాపను ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.
Read Also : NTR New Look: వెట్ హెయిర్, గడ్డంతో యంగ్ టైగర్ రచ్చ.. ఇది కదా అసలైన మాస్ లుక్!
Razor Movie Review
విశ్లేషణ
సినిమా ప్రారంభం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినా, కథ ముందుకు వెళ్లేకొద్దీ నీరసించిపోతుంది. కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. ముఖ్యంగా దర్శకుడిగా రవిబాబు కథనం కంటే హింస పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. తలలు నరకడం, శరీరాలను పాశవికంగా కోయడం వంటి సన్నివేశాలు సున్నిత మనస్కులకు ఇబ్బంది కలిగిస్తాయి. థియేటర్‌లో రెగ్యులర్ ఆడియన్స్ కూడా కళ్లు మూసుకునేంత క్రూరంగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. టెక్నాలజీని వాడుకుని స్క్రీన్ ప్లేను వేగంగా నడపాలని రవిబాబు చేసిన ప్రయత్నం కొంతవరకు బాగుంది. కానీ, రచనలో మరింత లోతు, లాజిక్ ఉంటే బాగుండేది. ఎటువంటి లాజిక్ లేని సన్నివేశాలు, మితిమీరిన హింస సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి.
నటీనటులు & సాంకేతికత
రుద్ర పాత్రలో రవిబాబు తన సీరియస్ మేకోవర్‌తో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం ఆయన భుజాల మీదే నడిచింది. తనీష్, ఇతర నటులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా చూస్తే.. నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. ఫోటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

