Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండేళ్లలో రూ.20 లక్షల కోట్లు ఆకర్షించిన ఏపీ: టీజీ భరత్

రెండేళ్లలో రూ.20 లక్షల కోట్లు ఆకర్షించిన ఏపీ: టీజీ భరత్

వార్త 3 weeks ago

TG Bharat: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.

గత రెండు సంవత్సరాల కాలంలోనే ఏపీ ఏకంగా రూ.20 లక్షల కోట్ల మెగా పెట్టుబడులను దక్కించుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఒక్కటే రూ.11.77 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 10.32 లక్షల మంది నిరుద్యోగ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఏపీ వాటానే అత్యధికంగా 24.3 శాతానికి చేరిందని, కంపెనీలకు అతి తక్కువ సమయంలో అనుమతులు ఇస్తూ రాష్ట్రం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business) విధానంలో దూసుకుపోతోందని వివరించారు.

అత్యాధునిక రంగాలపై ఫోకస్.. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’

రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసేలా సరికొత్త టెక్నాలజీ ఆధారిత రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని టీజీ భరత్ తెలిపారు. ఇందులో భాగంగా క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, స్పేస్ అండ్ డ్రోన్ సిటీలతో పాటు అధునాతన స్టీల్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామన్నారు. యువతను కేవలం ఉద్యోగులుగానే కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించేందుకు ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ అనే వినూత్న పాలసీని అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.

TG Bharat: రతన్ టాటా హబ్, స్పేస్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

యువతలోని సరికొత్త ఆవిష్కరణలను, స్టార్టప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో ‘స్పేస్ సిటీ’తో పాటు సరికొత్తగా ‘స్పేస్ టూరిజం’ (అంతరిక్ష పర్యాటకం)ను కూడా డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ‘భవ్య’ (BHAVYA) పార్కుల్లో.. కనీసం 3 నుంచి 4 పార్కులను ఆంధ్రప్రదేశ్‌కు దక్కించుకునేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. దీనికి తోడు ఎయిర్‌స్పేస్, డిఫెన్స్ (రక్షణ రంగం) విభాగాల్లో రూ.10 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసేందుకు పలు గ్లోబల్ కంపెనీలు ఏపీతో చర్చలు జరుపుతున్నాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

విషాదం.. తుంగభద్ర నదిలో మునిగి రెండు ఎద్దులు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha