Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో షార్ట్ లిస్ట్ విడుదల.. ఏప్రిల్ 27లోగా వెరిఫికేషన్

రెండో షార్ట్ లిస్ట్ విడుదల.. ఏప్రిల్ 27లోగా వెరిఫికేషన్

వార్త 2 months ago

Postal GDS: పోస్టల్ శాఖలో మొత్తం 28,636 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండో విడత షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశారు.

పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఈ ఎంపిక జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ద్వారానే ఈ నియామకాలు చేపడుతుండటం గమనార్హం.

Read Also:Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంక్‌లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

 The list of Postal GDS candidates for AP and Telangana has been released.

Postal GDS: ఏపీలో 555, తెలంగాణలో 214 మంది ఎంపిక.. ఏప్రిల్ 27 గడువు

తాజా జాబితా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుండి 555 మంది అభ్యర్థులు, తెలంగాణ సర్కిల్ నుండి 214 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాస్తవానికి ఏపీలో 1060, తెలంగాణలో 608 ఖాళీలు ఉండగా, దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో సంబంధిత డివిజనల్ కార్యాలయాల్లో ఏప్రిల్ 27వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని పక్షంలో వారి ఎంపికను రద్దు చేస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

NCL లో జాబ్స్..దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha