Dailyhunt
రెండు అసెంబ్లీ స్థానాల నుండి విజయ్ పోటీ.. 'అమ్మ' రికార్డును సమం చేస్తారా?

రెండు అసెంబ్లీ స్థానాల నుండి విజయ్ పోటీ.. 'అమ్మ' రికార్డును సమం చేస్తారా?

వార్త 2 weeks ago

Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుతూ రంగంలోకి దిగిన స్టార్ హీరో విజయ్, అడుగు వేస్తూనే సంచలనం సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్నారు.

రాజకీయ స్థిరత్వం కోసం మరియు భారీ అభిమాన గణాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకే ఆయన ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Read Also:IWI Negev LMG India: భారత్ కు అత్యాధునిక మెషిన్ గన్‌లు అందజేసిన IWI

జయలలిత తర్వాత విజయే..

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమీ కాకపోయినా, ఒక అగ్ర నాయకుడు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. జాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు. ఆ రెండు చోట్లా గెలిస్తే ఏదో ఒక దానికి మాత్రం రాజీనామా చేయాలి. 1991లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బర్గూర్, కాంగేయం నుండి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు. దీంతో కాంగేయం సీటును వదులుకుని బర్గూర్‌ ఎమ్మెల్యేగా అమ్మ కొనసాగారు. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత విజయ్ మళ్లీ అదే తరహాలో రెండు చోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ‘కెప్టెన్’ విజయకాంత్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ఒకే స్థానం (విరుదునగర్) నుండి పోటీ చేసి గెలిచారు.

 Tamil Nadu Election Schedule 2026

ఎన్నికల షెడ్యూల్, వ్యూహం

తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.ఈ ఎన్నికలు ప్రధానంగా తన పార్టీ (TVK), అధికార DMK మధ్యనే జరుగుతాయని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఇతర పార్టీలకు ధీటుగా టీవీకే కూడా అనేక ప్రజాకర్షక హామీలను (Populist Promises) తన మేనిఫెస్టోలో చేర్చింది.

Thalapathy Vijay: రెండు చోట్ల ఎందుకు?

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాల నుండి పోటీ చేయవచ్చు. ఒకచోట ఫలితం తారుమారైనా, మరోచోట గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ధీమాతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరంబూర్ వంటి పట్టణ నియోజకవర్గం, తిరుచ్చి ఈస్ట్ వంటి కీలక ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని ఆయన భావిస్తున్నారు.జయలలిత లాగే విజయ్ కూడా రెండు చోట్లా జయకేతనం ఎగురవేస్తారా? లేక ఒకే స్థానానికే పరిమితం అవుతారా అన్నది మే 4న తేలనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ కి ఆ సత్తా ఉందా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha