Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు పడవలు ఢీ.. 60కి చేరిన మృతుల సంఖ్య

రెండు పడవలు ఢీ.. 60కి చేరిన మృతుల సంఖ్య

వార్త 2 weeks ago

Congo Boat Accident: ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని ఈక్వాటూర్ ప్రావిన్స్‌ పరిధిలోని ఎన్‌గోంబే-లుకోలేలా ప్రాంత సమీపంలో కాంగో నదిపై ప్రయాణిస్తున్న రెండు పడవలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

కిన్షాసా వైపు నుంచి వస్తున్న ‘డైయు సె కాచే’ (Dieu se cache) అనే లోహపు నౌక, బుసింగా వైపు నుంచి వస్తున్న ‘హెచ్‌బీ సూపర్ విక్టోయిర్’ (HB Super Victoire) అనే చెక్క పడవను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

నీట మునిగిన పడవ.. భారీ ప్రాణనష్టం

ఈ ఘోర ప్రమాద ధాటికి చెక్క పడవ ఒక్కసారిగా నీట మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పడవ మునిగిపోవడంతో అనేక మంది ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Congo Boat Accident: రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికార యంత్రాంగం మరియు రెస్క్యూ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. నదిలో గల్లై్తయిన వారి కోసం గజఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. రాత్రి సమయం, నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు కొంత అంతరాయం కలుగుతున్నప్పటికీ, మునిగిపోయిన ప్రయాణికుల ఆచూకీ కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నారు.

బ్రిటన్ మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత జెఫ్రీ ఆర్చర్ ఇకలేరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha