Rahul Ramakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సామాజిక బాధ్యతతో ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో 'పెసా' (PESA - షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం, 1996) చట్టం అమలు తీరుపై ఆయన ప్రభుత్వాలను నిలదీశారు.
క్షేత్రస్థాయిలో ఈ చట్టం ఏ మేరకు అమలవుతుందో నిగ్గుతేల్చేందుకు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు దరఖాస్తులు సమర్పించారు. తాను దాఖలు చేసిన ఆర్టీఐ కాపీలను, సంధించిన ప్రశ్నలను ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
PESA Act 1996 Telugu States
తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు, అలాగే ఏపీలో గత కొన్నేళ్లుగా గిరిజన హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆయన నివేదికలు కోరారు. ఇరు రాష్ట్రాల గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి కీలకమైన అధికారిక పత్రాలు, ఫైళ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
read also:TG Politics: తొలి వర్షానికే కుదేలైన హైదరాబాద్.. సర్కార్ వైఫల్యంపై కేటీఆర్ ఫైర్
గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగంపై నిలదీత
గిరిజన గ్రామాల స్వయంపాలన, గ్రామసభల బలోపేతానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ రామకృష్ణ ప్రధానంగా దృష్టి సారించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సరిహద్దుల గుర్తింపు, గ్రామసభల ఏర్పాటుకు సంబంధించి జారీ చేసిన జీఓలు, సర్క్యులర్ల వివరాలు ఇవ్వాలని కోరారు. 2019 నుండి 2026 మధ్య కాలంలో జిల్లాల వారీగా జరిగిన గ్రామసభల సంఖ్య, వాటి హాజరు పట్టికలు, సమీక్షా నివేదికల కాపీలను అడిగారు.
అంతేకాకుండా, పెసా చట్టం అమలులో లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్రాలకు వచ్చిన లేఖల వివరాలను బయటపెట్టాలన్నారు. గిరిజనులకు చట్టంపై అవగాహన కల్పించే సదస్సుల కోసం కేటాయించిన, ఖర్చు చేసిన నిధుల లెక్కలను జిల్లాల వారీగా సమర్పించాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
Rahul Ramakrishna: మైనింగ్, భూసేకరణ నిర్ణయాలపై ఆరా
పెసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ లీజులు, పరిశ్రమలు లేదా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయాలంటే స్థానిక గ్రామసభల ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ ప్రతిపాదనలు, వాటికి గ్రామసభలు ఆమోదం తెలుపుతూ చేసిన తీర్మానాల రికార్డులను రాహుల్ రామకృష్ణ డిమాండ్ చేశారు.
భూసేకరణ కారణంగా నిర్వాసితులైన ఆదివాసీల పునరావాసం (R&R) విషయంలో చట్టపరమైన నిబంధనలు ఎంతవరకు పాటించారో స్పష్టం చేయాలన్నారు. గిరిజన భూవివాదాలు, కోర్టు కేసులు, అందిన ఫిర్యాదుల డేటాతో పాటు, పెసా అమలుపై రూపొందించిన తాజా సమగ్ర నివేదికల డిజిటల్ కాపీలను తనకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

