Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేప్ కేసులో క్రికెటర్ అరెస్ట్

రేప్ కేసులో క్రికెటర్ అరెస్ట్

వార్త 2 weeks ago

Cricketer Abishek Porel : భారత దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌పై తీవ్రస్థాయిలో లైంగిక ఆరోపణలు రావడంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగిక దాడి, బెదిరింపులకు పాల్పడ్డాడని ఒక వైద్య విద్యార్థిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ప్రైవేట్ ఫోటోలను అక్రమంగా సేకరించి, వాటి ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు కూడా నమోదయ్యాయి. జూన్ నెలలోనే ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ, పోలీసుల చర్యలపై సంతృప్తి చెందని బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

న్యాయస్థానం సీరియస్: డిజిటల్ ఆధారాల సేకరణకు ఆదేశం

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, అభిషేక్ పోరెల్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన సాక్ష్యాలుగా భావిస్తున్న అతడి మొబైల్ ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం యాక్షన్ మోడ్‌లోకి దిగిన కోల్‌కతా పోలీసులు పోరెల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఐపీఎల్‌లో కీలక ప్రతిభ చూపిన ఈ యువ ఆటగాడు కోర్టు కేసులను ఎదుర్కొంటుండటంతో అతని భవిష్యత్తు క్రికెట్ కెరీర్‌పై తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రపంచ అథ్లెటిక్స్‌లో బసంత్ సంచలనం.. హైజంప్‌లో రజత పతకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha