Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపే ఎన్నికల ఫలితాలు..ఐదు రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి?

రేపే ఎన్నికల ఫలితాలు..ఐదు రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి?

వార్త 3 weeks ago

Election Results: దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది.

రేపు (మే 4, సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Read Also:Assembly Election Results 2026:రేపే ఓట్ల లెక్కింపు.. ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలేది అప్పుడే!

ఫలితాల కంటే ముందే బెట్టింగ్ జోరు

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ ఒకవైపు ఉంటే, బెట్టింగ్ బంగార్రాజుల హడావుడి మరోవైపు కనిపిస్తోంది.

  • నయా మార్గం: పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ రాయుళ్లు ఐపీఎల్ తరహాలో ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా పందాలు కాస్తున్నారు. ఫోన్ కాల్స్ లేకుండానే యాప్‌ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు సాగిస్తూ జాగ్రత్తపడుతున్నారు.
  • హాట్ స్పాట్స్: ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై కోట్లలో పందాలు జరుగుతున్నట్లు సమాచారం. గెలిచే పార్టీలు, మెజార్టీ సీట్లు, చివరకు అభ్యర్థుల వారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారు.

కౌంటింగ్ ప్రక్రియ ఇలా..

ఎన్నికల సంఘం (EC) నిబంధనల ప్రకారం లెక్కింపు సాగనుంది:

  1. ఉదయం 8:00: మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
  2. ఉదయం 8:30: ఈవీఎం (EVM) లెక్కింపు ప్రారంభమవుతుంది.
  3. తొలి ట్రెండ్స్: ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ ముందంజలో ఉందో ప్రాథమిక అవగాహన రానుంది.
  4. తుది ఫలితం: మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Election Results: రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితి:

  • పశ్చిమ బెంగాల్ (294 సీట్లు): మమతా బెనర్జీ (TMC) వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో రిపోలింగ్ కారణంగా ఆ ఒక్క స్థానం ఫలితం మాత్రం మే 24న రానుంది.
  • తమిళనాడు (234 సీట్లు): అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తో పాటు నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
  • కేరళ (140 సీట్లు): ఎల్డీఎఫ్ (LDF) వరుసగా మూడోసారి అధికారం నిలబెట్టుకుంటుందా? లేక యూడీఎఫ్ (UDF) పుంజుకుంటుందా? అనేది రేపు తేలనుంది.
  • అస్సాం (126 సీట్లు): బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండగా, కాంగ్రెస్ కూటమి గట్టి నమ్మకంతో ఉంది.

ఎన్నికల టాప్ 9 ముఖ్యాంశాలు:

  1. సుప్రీంకోర్టు తీర్పు: కౌంటింగ్ అధికారుల నియామకంపై టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
  2. భద్రత: బెంగాల్‌లో కౌంటింగ్ కోసం అదనంగా 165 మంది పరిశీలకులను ఈసీ నియమించింది.
  3. ఏర్పాట్లు పూర్తి: సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపునకు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  4. దీదీ ధీమా: తమ పార్టీ 200లకు పైగా సీట్లు సాధిస్తుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
  5. రిపోలింగ్: బెంగాల్‌లోని 15 పోలింగ్ స్టేషన్లలో ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు భారీగా ఓటు వేశారు.
  6. ఆందోళనలు: బెంగాల్‌లో టీఎంసీ నేతలు బెదిరిస్తున్నారంటూ స్థానికులు రీపోలింగ్ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.
  7. అస్సాం ఆరోపణలు: స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
  8. డీకే శివకుమార్ రంగ ప్రవేశం: తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గౌహతి చేరుకున్నారు.
  9. TVK ఫిర్యాదు: తమిళనాడులో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని మరియు తమ పార్టీ కార్యాలయంపై దాడిపై విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఫిర్యాదు చేసింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha