AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. రేపు (బుధవారం) ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని రేపు పరీక్షించుకోనున్నారు.
ఫలితాలు ఎలా చూడాలి? (Official Websites & WhatsApp)
విద్యార్థుల సౌకర్యార్థం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఫలితాలను ఆన్‌లైన్‌తో పాటు వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది:
- అధికారిక వెబ్‌సైట్:https://resultsbie.ap.gov.in ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వాట్సాప్ ద్వారా: విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను 9552300009 నంబర్‌కు పంపడం ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు.
AP Inter Results 2026 link and WhatsApp number
AP Inter Results 2026: సంస్కరణల వల్లే ఆలస్యం?
ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించబడ్డాయి. అయితే, ఈసారి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని విప్లవాత్మక సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెలరోజుల సమయం పట్టింది. ఈ మార్పుల వల్ల మూల్యాంకన ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించడం వల్లే ఫలితాల విడుదలకు అధికారులు కొంత అదనపు సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా, ఫలితాల విడుదల తేదీ ఖరారు కావడంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పడనుంది. విద్యార్థులు సర్వర్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారిక పోర్టల్‌తో పాటు వాట్సాప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also

