Dailyhunt
రేపే ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

రేపే ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

వార్త 2 weeks ago

ఒంటిమిట్ట కోదండ రాముని దర్శించుకున్న కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, జగన్మోహన్ రాజు తదితరులు

Sitarama Kalyanam 2026: కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి కనివిని ఎరుగని విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు.

సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సోమవారం పరిశీలించారు. కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, టిటిడి జెఈఓ వీరబ్రహ్మంతో కలిసి మంత్రి క్షుణ్ణంగా సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను, రామలయాన్ని, కళ్యాణ వేదిక పరిశీలించారు. సీఎం బస చేసే టీటీడీ అతిథి గృహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ విశ్వనాధ్, అధికారులతో కలిసి పరిశీలించారు.

Read also: Sun Idol for Home : ఇంట్లో సూర్యుడి విగ్రహం పెట్టుకోవచ్చా..? పండితులు ఏంచెపుతున్నారు ?

The celestial wedding of Sita and Rama at Vontimitta is tomorrow.

Sitarama Kalyanam 2026: కల్యాణ వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వం సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూసేందుకు భక్తులు వస్తారని వారిని ప్రేమతో పలకరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రితోపాటు పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్రాజు, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య, పార్టీ రాష్ట్ర నేత రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, నవనీత కృష్ణుడిగా అలరించిన ఒంటిమిట్ట రామ ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆగమోక్తంగా ప్రారంభమైన చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha