PM Sanae Takaichi India Visit: భారతదేశం మరియు జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తూ సరిహద్దుల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపే ఒక ప్రతిష్టాత్మక పర్యటన ఖరారైంది.
జపాన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన సనాయే తకైచీ (Japan PM Sanae Takaichi) జూలై 1 నుంచి జూలై 3 వరకు భారతదేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆహ్వానం మేరకు ఢిల్లీకి రానున్న సనాయే తకైచీ, ఇరు దేశాల మధ్య జరగబోయే '16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం' (16th India-Japan Annual Summit) లో పాల్గొంటారు. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Read Also:America-India: చైనా సాంకేతిక ఆధిపత్యానికి భారత్-అమెరికా చెక్!
టార్గెట్ చైనా.. ఇండో-పసిఫిక్‌లో పటిష్ట వ్యూహం!

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో (Indo-Pacific Region) మరియు దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెంచుతున్న ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల (Geopolitical headwinds) నేపథ్యంలో ఈ మోదీ-తకైచీ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని (Defence Cooperation) మరింత పెంచడం, ఉమ్మడి సైనిక విన్యాసాల విస్తరణ మరియు మౌలిక సదుపాయాల (Infrastructure) కల్పనపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. గ్లోబల్ సప్లై చైన్‌ను బలోపేతం చేస్తూ.. సెమీకండక్టర్లు (Semiconductors), కీలక ఖనిజాలు (Critical Minerals), మరియు క్లీన్ ఎనర్జీ-ఇంధన భద్రత (Energy Security) రంగాలలో పరస్పర సాంకేతిక బదిలీలపై ఈ సదస్సులో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
PM Sanae Takaichi India Visit: 10 ట్రిలియన్ యెన్ల భారీ పెట్టుబడులపై సమీక్ష
గతంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల ప్రకారం.. రాబోయే పదేళ్లలో భారతదేశంలో ప్రైవేట్ రంగం ద్వారా 10 ట్రిలియన్ యెన్ల (సుమారు 68 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పెట్టుబడుల పురోగతి మరియు ప్రస్తుతం భారతదేశంలో సాగుతున్న ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ (High-Speed Rail) వంటి మెగా ప్రాజెక్టుల పురోగతిపై ఈ 16వ వార్షిక సదస్సులో ఇరు ప్రధానులు క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. మొదట ఈ సదస్సును అస్సాంలోని గువహటిలో నిర్వహించాలని భావించినప్పటికీ, జపాన్ ప్రధాని తకైచీ డైట్ (జపాన్ పార్లమెంట్) సమావేశాల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ పర్యటనను కేవలం దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం చేశారు.
Epaper: epaper.vaartha.com
వెనిజులాలో వందకు పైగా గల్లంతు.. అమెరికా బహిష్కరణ జరిగిన కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం!

