Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ.. మంత్రి పొన్నం

రేపు బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ.. మంత్రి పొన్నం

వార్త 1 week ago

TG Free Sewing Machine Scheme: తెలంగాణలోని బీసీ మహిళల ఆర్థిక స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

బీసీ మహిళలకు పూర్తి సబ్సిడీతో ఉచితంగా కుట్టు మెషీన్లను అందించే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా గురువారం రోజున సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను పంపిణీ చేసి పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

Read Also : Telangana cotton purchase: సెప్టెంబరు నుంచే పత్తి కొనుగోళ్లు

 Sewing machines to be distributed to BC women tomorrow: Minister Ponnam

TG Free Sewing Machine Scheme: నియోజకవర్గానికి 1,000 కుట్టు మెషీన్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 మంది లబ్ధిదారులకు ఈ ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను అందించేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆధునిక కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా మహిళలు ఇంట్లోనే ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉచితంగా సబ్సిడీ పథకం

ఈ పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంది. ఈ ఉచిత ఆటోమేటిక్ కుట్టు మెషీన్ల పంపిణీ ప్రక్రియ అంతా 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతోనే అమలు కానుంది. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నేరుగా ఈ యంత్రాలను అందించనుండటంతో బీసీ మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ఫ్లైఓవర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha