Dailyhunt
రేపు పంజాగుట్టలో నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు

రేపు పంజాగుట్టలో నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు

వార్త 1 week ago

Nadendla Bhaskara Rao Funeral: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు (90) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లో సంతాపం వ్యక్తమవుతోంది.

వయోభారంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు.

Read Also :Kadapa crime: కాబోయే భర్త మానసిక వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

 Nadendla Bhaskara Rao’s funeral tomorrow in Panjagutta

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. నాదెండ్ల మృతికి సంతాపంగా పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha