Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురు అందించారు.
రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 48 గంటల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ.. మహిళా సంఘాలకు ఊతం
హైదరాబాద్‌లోని నాంపల్లి మరియు చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది పేద లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు గూడు కల్పించడంతో పాటు మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల (ఆర్థిక పొదుపు సంఘాల) బలోపేతం కోసం త్వరలోనే వడ్డీలేని రుణాలను అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026'కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

