Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ సర్కార్‌కు గణపయ్య సద్బుద్ధి ప్రసాదించాలి: రాంచందర్ రావు

రేవంత్ సర్కార్‌కు గణపయ్య సద్బుద్ధి ప్రసాదించాలి: రాంచందర్ రావు

వార్త 2 weeks ago

Ramchander Rao: తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా గణేశ్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

రేవంత్ సర్కార్‌కి 'సద్బుద్ధి' ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని కోరాం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేసేలా, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సక్రమంగా నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఆ విఘ్నేశ్వరుడు సరైన 'సద్బుద్ధి'ని ప్రసాదించాలని తాను స్వామివారిని వేడుకున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. పండుగ వేళ ప్రజల ఆశలను నిజం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Ramchander Rao: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి - రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలి

ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం పాడిపంటలతో సిరులు పండించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలి

ఏటా గణేశ్ ఉత్సవాల పట్ల ప్రజల్లో భక్తిప్రపత్తులు మరింత ఇనుమడిస్తున్నాయని, రాష్ట్రంలోని ఊరూరా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో భాగస్వాములు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు మరియు మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు భద్రతా చర్యలు, రవాణా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేయాలని ఆయన సూచించారు.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha