Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిటైర్మెంట్ తర్వాత రోహిత్‌ను వదులుకోవద్దు.. కోహ్లి కోచ్‌గా మారే అవకాశం లేదన్న అశ్విన్

రిటైర్మెంట్ తర్వాత రోహిత్‌ను వదులుకోవద్దు.. కోహ్లి కోచ్‌గా మారే అవకాశం లేదన్న అశ్విన్

వార్త 1 week ago

Rohit Sharma: టీమిండియా వెటరన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్ పాత్రలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికరమైన అంచనాలను పంచుకున్నారు.

రోహిత్ శర్మ అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యాలు కలిగి ఉన్నాడని, భవిష్యత్‌లో అతను కోచ్‌గా లేదా మెంటార్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అశ్విన్ స్పష్టం చేశారు.

ముంబై ఇండియన్స్‌కు అశ్విన్ కీలక సూచన

రోహిత్ శర్మ భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ, రోహిత్ ఆట నుంచి తప్పుకోగానే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడి సేవలను తక్షణమే వినియోగించుకోవాలని అశ్విన్ సలహా ఇచ్చారు. ఐదుసార్లు ఐపిఎల్ టైటిళ్లు అందించడంతో పాటు భారత్‌కు ప్రపంచకప్ గెలిపించిన గొప్ప కెప్టెన్ అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, ఇలాంటి అరుదైన ఆలోచనాపరులు సులభంగా దొరకరని ఆయన అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీపై అశ్విన్ అంచనాలు

మరోవైపు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే విషయమై అశ్విన్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విరాట్ వెంటనే కోచింగ్ వైపు అడుగులు వేయకపోవచ్చని తెలిపారు. సుదీర్ఘకాలం పాటు అత్యంత తీవ్రమైన ఒత్తిడితో కూడిన క్రికెట్ ఆడిన కోహ్లీ, తన సుదీర్ఘ కెరీర్ తర్వాత కొంతకాలం కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడని ఆయన అంచనా వేశారు.

మారుతున్న క్రికెట్ స్వరూపం – రిటైర్డ్ స్టార్లకు కొత్త అవకాశాలు

భవిష్యత్తులో క్రికెట్ ముఖచిత్రం పూర్తిగా మారుతుందని, ఫ్రాంచైజీ క్రికెట్ మరింత ఆధిపత్యం చెలాయిస్తుందని అశ్విన్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం హెడ్ కోచ్‌గానే కాకుండా మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వంటి ప్రత్యేక పాత్రలు రానున్నాయని, ఇవి రిటైర్మెంట్ ప్రకటించే స్టార్ ఆటగాళ్లకు అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు.

2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha