ఇరాన్లో ప్రభుత్వాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గానికి, సైనిక నాయకత్వానికి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌ను పూర్తిస్థాయి రాజకీయ సంక్షోభంలోకి నెట్టాయని, ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వాన్ని రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ అధీనంలోకి తీసుకుందని ఇరాన్ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక ప్రచురించింది.
అధ్యక్షుడి నియామకాలు, నిర్ణయాలను ఐఆర్జీసీ అడ్డుకుని, అధికారాన్ని చేజిక్కించుకుందని, తద్వారా పాలనను కార్యనిర్వాహక శాఖ నుంచి సమర్థవంతంగా తొలగించిందని సమాచారం ఉన్నట్టు తెలిపింది.
Revolutionary Guard Corps: రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతికి ఇరాన్ ప్రభుత్వం
Revolutionary Guard Corps: రివల్యూషనరీ గార్డ్ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది ఒత్తిడి కారణంగా..
కొత్త ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించేందుకు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చేసిన ప్రయత్నాలు.. రివల్యూషనరీ గార్డ్ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది ఒత్తిడి కారణంగా విఫలమయ్యాయని ఆ నివేదిక తెలిపింది. హుస్సేన్ దేహ్‌ఘాన్‌తో సహా ప్రతిపాదిత అభ్యర్థుల నియామకాలను వాహిది తిరస్కరించారు. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ముఖ్యమైన, సున్నితమైన నాయకత్వ పదవులకు సంబంధించిన అన్ని నియామకాలను సైన్యమే నేరుగా చేపట్టాలని, వాటిని నిర్వహించాలని వాహిది పట్టుబట్టారని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్ ఆమోదం పొందిన తర్వాతే నిఘా మంత్రులను అధ్యక్షుడు నామినేట్ చేసేవారు. కీలకమైన భద్రతా విభాగాలపై తుది అధికారం ఆయనకే ఉండేది. కానీ, యుద్ధం ప్రారంభమైన రోజునే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడం, ఆయన స్థానంలో వచ్చిన కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ హోదా, స్థానంపై అనిశ్చితి నెలకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

