Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు పక్కన ఐఈడీ బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

రోడ్డు పక్కన ఐఈడీ బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

వార్త 2 weeks ago

Khyber Pakhtunkhwa Terror Attack: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫుఖ్తుంక్వా ప్రావిన్స్‌లో శనివారం ఘోర ఉగ్రదాడి చోటుచేసుకుంది. బన్నూ జిల్లా పరిధిలోని మర్కా బేరే ప్రాంతంలో రోడ్డుపై అమర్చిన ఐఈడీ (IED) ల్యాండ్ మైన్ బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డుపై వెళ్తున్న ఒక ప్రయాణికుల వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఉగ్ర ఉదంతానికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు.

Read also:Hindus In Bangladesh : శ్రీరాముడిని అవమానించారని బంగ్లాదేశ్ హిందువుల నిరసన

Khyber Pakhtunkhwa Terror Attack:రెస్క్యూ వాహనంపై కూడా ప్రభావం.. సీఎం సోహేల్ అఫ్రిదీ ఖండన

 Seven people were killed and three others injured in the attack, which targeted a passenger van.

స్థానిక పోలీసు అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు రోడ్డుపై నాటిన అత్యంత శక్తివంతమైన ఐఈడీ పేలడంతో తొలుత ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌లోని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి వస్తున్న రెస్క్యూ (సహాయక) వాహనం కూడా ఈ పేలుడు ధాటికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే అదనపు భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను, మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర దాడిని ఖైబర్ ఫుఖ్తుంక్వా ముఖ్యమంత్రి సోహేల్ అఫ్రిదీ తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'ఐ యామ్ ది బాస్' వ్యాఖ్యలపై ట్రంప్ క్లారిటీ: కేవలం జోక్ మాత్రమేనని వివరణ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha