Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారా.. ఇక జాగ్రత్త!

రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారా.. ఇక జాగ్రత్త!

వార్త 3 months ago

Telangana Parking Rules: తెలంగాణలో వాహనదారులు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపితే ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

రవాణా శాఖ సిద్ధం చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను వెంటనే టోయింగ్ చేసి తీసుకెళ్తారు. దీనికి అయ్యే ఖర్చుతో పాటు అదనపు జరిమానాలు కూడా వాహన యజమానులే భరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ముసాయిదా పాలసీని త్వరలోనే అమలు చేయబోతోంది.

Read also: Pension : పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

 New Parking Rules in Telangana 2026

Telangana Parking Rules: వాహనం చెడిపోయిందని వదిలేస్తే ఇక అంతే

మీ వాహనం ఒకవేళ రోడ్డుపై బ్రేక్ డౌన్ అయినా సరే, దాన్ని అలాగే వదిలేయడానికి వీల్లేదు. అలా వదిలేస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్లో బండి ఉన్న ప్రతి రోజుకు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 45 రోజుల్లోపు మీ వాహనాన్ని క్లెయిమ్ చేసుకోకపోతే, ప్రభుత్వం ఆ బండిని వేలం వేసే అవకాశం ఉంది. పాత పెండింగ్ చలాన్లు ఉంటే అవి కూడా కడితేనే మీ బండి మీకు తిరిగి వస్తుంది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో కొత్త నిబంధనలు

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపితే అస్సలు వదలరు. ఈ కొత్త ముసాయిదాపై ప్రజల నుంచి సూచనలు తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లోకి వస్తాయి. వాహనదారులు ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా నిబంధనలు పాటిస్తే ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెట్రోల్ ధరల సెగ.. కాన్వాయ్‌లు తగ్గించిన చంద్రబాబు, రేవంత్, పవన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha