Osmania Hospital: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యాలయం 'ఉస్మానియా జనరల్ ఆస్పత్రి' (OGH) మరో అరుదైన శస్త్రచికిత్సతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ గతంలో ఎన్నో కఠినమైన, సంక్లిష్టమైన ఆపరేషన్లను సక్సెస్ చేసిన ఉస్మానియా వైద్యులు.. తాజాగా దేశంలోనే ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఒకేసారి ఒక రోగికి ఏకంగా 5 అవయవాలను మార్పిడి చేసి సరికొత్త మైలురాయిని అందుకున్నారు.
ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు, రోగుల ఆరోగ్యం పట్ల వారికి ఉన్న అంకితభావానికి ఈ అరుదైన ఘనత నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 30 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరుదైన, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆ యువకుడి ప్రాణాలు రక్షించేందుకు ఉస్మానియా ఆస్పత్రి సర్జన్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో సంక్లిష్టమైన ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ఏకధాటిగా 36 గంటల పాటు సాగడం గమనార్హం. వైద్య బృందం రాత్రింబవళ్లు శ్రమించి, రోగికి విజయవంతంగా అవయవ మార్పిడి పూర్తి చేశారు.
Read Also: Telangana bandh July 10: జులై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్
Osmania doctors transplanted five organs into a patient in a single procedure.
Osmania Hospital: మార్పిడి చేసిన 5 కీలక అవయవాలు ఇవే..
సాధారణంగా ఒక వ్యక్తికి ఒకేసారి ఒక అవయవం మార్పిడి చేయడమే వైద్యులకు ఎంతో పెద్ద సవాలుతో కూడుకున్న పని. అలాంటిది ఈ ఆపరేషన్‌లో రోగికి ఒకేసారి ఐదు అవయవాలను విజయవంతంగా అమర్చారు.
- జీర్ణాశయం (Stomach)
- ద్వాదశ శుక్లం (Duodenum)
- క్లోమం (Pancreas)
- చిన్న పేగు (Small Intestine)
- కుడి వైపు పెద్ద పేగు (Right Colon)
ఈ ఐదు కీలక అవయవాలను ఒకే శస్త్రచికిత్సలో మార్పిడి చేయడం మన దేశ వైద్య చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. దీనితో ఉస్మానియా డాక్టర్లు భారత వైద్య రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా..
కోట్లాది రూపాయలు ఖర్చయ్యే ఇలాంటి అత్యంత అరుదైన మల్టీ-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ (Multi-organ Transplant) సర్జరీని ప్రభుత్వ రంగంలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఉచితంగా, అంతకంతకూ విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణంగా నిలిచింది. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య సదుపాయాలకు తామేమీ తీసిపోమని ఉస్మానియా వైద్యులు మరోసారి నిరూపించారు. ఈ అసాధారణ విజయం పట్ల రోగి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, వైద్య ప్రముఖులు ఉస్మానియా సర్జన్ల బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

