Dailyhunt
రోహిత్, రితేష్, నమిత్ ల రెండో రోజు విచారణ

రోహిత్, రితేష్, నమిత్ ల రెండో రోజు విచారణ

వార్త 3 weeks ago

Moinabad Farmhouse Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎం ఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మలను చేవెళ్ల పోలీసులు వరుసగా రెండవ రోజూ విచా రించారు.

వీరిని మంగళవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు తొమ్మిది గంటల పాటు విచారించడం తెలిసిందే. రెండవ రోజు బుధవారం కూడా తొమ్మిది గంటల పాటు విచారించారు. వరుసగా రెండవ రోజు కూడా వీరిని శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్లో గల శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లోనే విచారించారు. ఈ విచారణను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతం స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కనిపించడం లేదని అతని తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పంది ంచడం లేదు. దీనిపై వారు మౌనం వహించడం గమనార్హం.

Read also: Dammaiguda crime: దమ్మాయిగూడలో దారుణ హత్య.. పొదల్లో మహిళ మృతదేహం

 Farmhouse drugs case: Custody to end today.

Moinabad Farmhouse Drugs Case: రెండో రోజు విచారణ

మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీపై ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ నెల 14వ తేదీన జరిగిన పార్టీని అ దేరోజు రాత్రి పోలీసులు రట్టు చేయడం తెలిసిందే. ఈ పార్టీలో 11 మంది పాల్గొనగా వీరిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపి పుట్టా మహేష్ యాదవ్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్లు తేలడం విదితమే. ఫాం హౌస్లోకి వచ్చిన పోలీసులను బెదరగొట్టేందుకు రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు నమిత్ శర్మ నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమిత్ శర్మ కాల్పులు జరిపిన రివాల్వర్ రితేష్ రెడ్డిది కావడంతో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సమాచారం ఇవ్వని నిందితులు.. మరోసారి కస్టడీ కోరే అవకాశం

ఈ కేసులో మరింతగా వి చారించేందుకు ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. గురువారంతో ముగియనున్న ఈ విచారణలో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులు పోలీసులు ఆశించినంతగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదని తెలిసింది. డ్రగ్స్ పెడ్లర్లతో తమకున్న సంబంధా లపై రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు నోరు మెదపడం లేదని తెలిసింది. దీంతో ముగ్గురిని మరోదఫా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు తెలిసింది. గురువారం నాడు వీరిని మొయినాబాద్ ఫాం హౌస్ కు తీసుకువెళ్లి అక్కడ మరోదఫా విచారించి అనంతరం నేరుగా రాజేం ద్రనగర్ కోర్టులో హాజరు పరిచి, అటుపిమ్మట చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. అంతకు ముందు ముగ్గురికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల నివేదికను జైలు అధికారులకు ఇవ్వనున్నారు.

కాగా ముగ్గురు నిందితులు వెల్లడించిన అరకొర సమాచారం తమకు సం తృప్తి ఇవ్వలేదని, కేసు విచారణలో ఇది ఎంతమాత్రం సరిపోనందున ముగ్గురిని మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరాలని నిర్ణయించారని తెలిసింది. దీనిపై గురువారం లేదా శుక్రవారం నాడు పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నార ని తెలిసింది. మరోవైపు పోలీసుల కస్టడీలో వున్నాడని చెబుతున్న డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ వ్యవహారం ఇంకా మిస్టరీగానే వుంది. తన కుమారు డిని పోలీసులు తీసుకు వెళ్లారని అభిషేక్ సింగ్ తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫాం హౌస్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న మొయి నాబాద్ పోలీసులు దీనిపై మౌనం వహించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఉపాధి హామీపై సిపిఐ పోరుబాట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha