Dailyhunt
రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ!

రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ!

వార్త 4 days ago

Rohit Sharma fast fifty: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ (MI) ఓపెనర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సమాధానం ఇస్తున్నారు.

గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, తిరిగి జట్టులోకి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే పాత రోహిత్‌ను గుర్తు చేస్తూ వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లక్నో బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా షాట్లు ఆడిన రోహిత్, తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు మరియు 5 కళ్లు చెదిరే సిక్సర్లతో 52 పరుగులు చేసి దూకుడుగా కొనసాగుతున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూస్తుంటే గాయం ప్రభావం ఏమాత్రం కనిపిండం లేదు సగటు ముంబై అభిమానులకు కనువిందు చేస్తోంది.

Rohit Sharma fast fifty: జోరు మీదున్న రికల్టన్

రోహిత్ శర్మకు తోడుగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రోహిత్ కంటే ముందే రికల్టన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో లక్నో నిర్దేశించిన భారీ స్కోరు ముంబైకి సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. రోహిత్, రికల్టన్‌ల జోరు చూస్తుంటే ఈ మ్యాచ్‌ ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. లక్నో బౌలర్లు ఈ ప్రమాదకరమైన జోడీని విడదీయడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

16 బంతుల్లో 50 కొట్టిన నికోలస్ పూరన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha