Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే!

రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే!

వార్త 2 weeks ago

Fiber in Food: భారతీయుల ఆహారపు అలవాట్లు, రోజువారీ పోషకాల లభ్యతపై జరిగిన ఒక తాజా అధ్యయనం తీవ్ర ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. దేశంలో దాదాపు 70 శాతం మంది (అంటే ప్రతి 10 మందిలో ఏడుగురు) తాము తీసుకునే రోజువారీ భోజనంలో శరీరానికి అవసరమైన మేర పీచుపదార్థం (ఫైబర్) తీసుకోవడం లేదని తేలింది.

ప్రస్తుతం జనాభాలో జీర్ణక్రియ సమస్యలు, ఇతర ఆధునిక జీవనశైలి వ్యాధులు వేగంగా పెరగడానికి ఈ ఫైబర్ లోపమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం’ పురస్కరించుకుని ఐటీసీ ఆశీర్వాద్‌కు చెందిన ‘హ్యాపీ టమ్మీ ఫైబర్ మీటర్’ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేసింది. 2021 నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా సుమారు 6.5 లక్షల మందిపై జరిపిన సర్వే విశ్లేషణల ఆధారంగా ఈ కీలక వివరాలను వెల్లడించారు.

 ITC Ashirvaad Survey Report

పురుషులకంటే మహిళల్లోనే ఎక్కువ లోపం.. పండ్ల వాడకం తక్కువే!

ఈ నివేదిక ప్రకారం.. పీచుపదార్థం తక్కువగా తీసుకోవడంలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మనదేశంలో కేవలం నలుగురిలో ఒక్కరు మాత్రమే నిత్యం మల్టీగ్రెయిన్ (బహుళ ధాన్యాలు) ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇక దాదాపు 40 శాతం మంది భారతీయులు తమ డైట్‌లో పండ్లను చేర్చుకోవడం చాలా అరుదుగా జరుగుతోందని సర్వే స్పష్టం చేసింది. భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాల మోతాదు తక్కువగా ఉండటం వల్లే శరీరానికి ఫైబర్ అందడం లేదని వెల్లడైంది.

Read also:Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర మెదడుకు మంచిదేనా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

Fiber in Food: రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే! ఫైబర్ తగ్గితే వచ్చే ఆరోగ్య ముప్పులివే.. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల హెచ్చరిక

ఆహారంలో పీచుపదార్థం లోపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు:

జీర్ణకోశ సమస్యలు: తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల తీవ్రమైన మలబద్ధకం, కడుపు ఉబ్బరం (బ్రెత్ లెస్ నెస్/బ్లోటింగ్), పేగుల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

దీర్ఘకాలిక వ్యాధులు: రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫైబర్ ఎంతో అవసరం. ఇది తగ్గితే డయాబెటిస్ (మధుమేహం), ఊబకాయం (Obesity) వంటి జీవక్రియ రుగ్మతల ముప్పు పెరుగుతుంది.

ప్రస్తుత రోజుల్లో ప్రాసెస్ చేసిన, రిఫైన్డ్ (శుద్ధి చేసిన) జంక్ ఫుడ్స్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడమే ఈ దుస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లోపాన్ని అధిగమించాలంటే ముడి ధాన్యాలు, పప్పుధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది: ఐటీసీ

ఈ సర్వే ఫలితాలపై ఐటీసీ లిమిటెడ్ (స్టేపుల్స్) బిజినెస్ యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనుజ్ రుస్తాగి స్పందించారు. “ప్రస్తుత యాంత్రిక జీవనంలో జీర్ణక్రియ ఆరోగ్యం, గట్ (పేగుల) సంరక్షణ అనేవి మన దైనందిన పోషకాహారంలో అత్యంత కీలకమైన భాగాలుగా మారాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎంతటి ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తుందో ప్రజలకు మరింతగా వివరించాల్సిన అవసరం ఉందని ఈ సర్వే ఫలితాలు నొక్కిచెబుతున్నాయి. ప్రతిరోజూ తినే ఆహారంలో మల్టీగ్రెయిన్స్, పండ్లు, ఆకుకూరల శాతాన్ని పెంచుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవచ్చు” అని ఆయన వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

తలనొప్పి సమస్య రోజు రోజుకీ ఎక్కువవుతుందా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha