Benefits of Drinking Water: మన శరీరంలో దాదాపు 60 శాతం పైగా నీరే ఉంటుంది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా నీళ్లు సరిపడా తాగడం చాలా ముఖ్యం.
కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా, క్రమ పద్ధతిలో నీళ్లు తాగడం వల్ల చర్మం, జుట్టుపై అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Rose Apple: రోజ్ ఆపిల్ ప్రయోజనాలు.. వేసవిలో ఆరోగ్య రహస్యం!

ఎన్ని లీటర్లు తాగాలి?
సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 3.5 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది వాతావరణం, మీ శారీరక శ్రమ, బరువుపై కూడా ఆధారపడి ఉంటుంది.
నీళ్లతో కలిగే అద్భుత ప్రయోజనాలు
- చర్మ సౌందర్యం: నీళ్లు పుష్కలంగా తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మానికి సహజమైన ‘గ్లో’ని ఇస్తుంది.
- మొటిమల నివారణ: శరీరంలోని వ్యర్థాలు (Toxins) చెమట, మూత్రం ద్వారా బయటకు వెళ్లడం వల్ల రక్తం శుద్ధి జరిగి మొటిమలు తగ్గుతాయి.
- జుట్టు సంరక్షణ: డీహైడ్రేషన్ వల్ల జుట్టు పొడిబారి రాలిపోతుంది. తగినంత నీరు తాగితే జుట్టు కుదుళ్లు బలోపేతమై జుట్టు రాలడం తగ్గుతుంది.
- గోళ్ల పెరుగుదల: నీటి శాతం బాగుంటే గోళ్లు విరిగిపోకుండా బలంగా, అందంగా పెరుగుతాయి.
- యవ్వనం: చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల వయసు పెరిగినా ముఖంపై ముడతలు త్వరగా రావు.
నీళ్లు తాగకపోతే వచ్చే ఇబ్బందులు
శరీరానికి తగినంత నీరు అందకపోతే ముఖం ఉబ్బినట్లు అనిపించడం (Puffiness), చర్మం పొడిబారి దురద రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా కిడ్నీ సమస్యలు, జీర్ణక్రియ మందగించడం వంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

