Dailyhunt
RRB: రైల్వే రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల

RRB: రైల్వే రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల

వార్త 3 months ago

దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో ఉద్యోగ భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో 2026 ఫిబ్రవరి 11, 12న నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని RRB సూచించింది.

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీ కోసం 2025 సెప్టెంబర్‌లో RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

రాత పరీక్ష తర్వాత ఎంపిక ప్రక్రియ

రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు 4 రోజుల ముందు RRB విడుదల చేస్తుంది. రాత పరీక్ష అనంతరం కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Constable Recruitment: టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha