Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ. 1.20 కోట్ల బీమా కోసం స్నేహితుడి దారుణ హత్య

రూ. 1.20 కోట్ల బీమా కోసం స్నేహితుడి దారుణ హత్య

వార్త 2 months ago

Man Murdered By Friends : నమ్ముకున్న స్నేహితులే పక్కా ప్రణాళికతో బలితీసుకున్న దారుణ ఘటన నారాయణపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఒక అమాయక కార్మికుడిని దారుణంగా హతమార్చిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన బోడి బాల్‌రాజు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి పనిచేస్తున్నాడు. అయితే, బాల్‌రాజు స్నేహితులు (జక్లేర్, గుడిగేండ్ల, మక్తల్‌కు చెందిన వ్యక్తులు) అతడిని అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. బాల్‌రాజు పేరు మీద ఏకంగా రూ. 1.20 కోట్ల జీవిత బీమా (Insurance Policy) చేయించారు. ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా ఆ స్నేహితులే కడుతూ వచ్చారు.

Read Also: TG Politics: తొలి వర్షానికే కుదేలైన హైదరాబాద్.. సర్కార్ వైఫల్యంపై కేటీఆర్ ఫైర్

 Man Murdered By Friends

Man Murdered By Friends : రూ. 1.20 కోట్ల బీమా కోసం స్నేహితుడి దారుణ హత్య జూన్ 3న హత్యాకాండ.. రోడ్డు ప్రమాదంగా డ్రామా

పథకం ప్రకారం ఈ నెల 3న బాల్‌రాజును మక్తల్‌లోని ఓ గ్రామానికి పిలిపించారు. అక్కడ అతనికి విపరీతంగా మద్యం తాగించారు. బాల్‌రాజు పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత కర్రలతో దాడి చేశారు. అయినా చావకపోవడంతో ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, ఇది రోడ్డు ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశారు. మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బాల్‌రాజు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహంపై ఉన్న గాయాలు ప్రమాదం వల్ల వచ్చినవి కాదని, హత్యగా గుర్తించారు. బాధితుడి కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా స్నేహితుల బండారం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు బాల్‌రాజు కుటుంబానికి రూ. 40 లక్షలు ఇస్తామని లంచం ఆశచూపినట్లు తేలింది. బాల్‌రాజు మృతితో ఆయన భార్య అనురాధ, మైనర్ పిల్లలు కృష్ణవేణి, విష్ణు, రవి అనాథలుగా మారారు. వృద్ధులైన తల్లిదండ్రులు కూడా బాల్‌రాజు సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న వయసులోనే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మంచిర్యాల జిల్లాలో విషాదం..గోడ కూలి ఏడేళ్ల బాలిక మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha